Skip to main content

సాక్షి మాజీ యాంకర్ , నటుడు శ్రీనివాస్ రెడ్డీలకు జగన్ కీలక పదవులు



తిరుమల , తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ( ఎస్వీబీసీ ) బోర్డులో డైరెక్టర్లుగా టీవీ యాంకర్ స్వప్న , నటుడు ‌శ్రీనివాస్ రెడ్డీలను ఏపీ ప్రభుత్వం నియమించింది . ఎస్వీబీసీ చైర్మెన్ గా పృధ్వీరాజ్ బాలిరెడ్డీని గతంలో నియమించిన సంగతి తెలిసిందే.ఆయనతో కలిసి ఈ డైరెక్టర్స్ ఇద్దరూ పనిచేయనన్నారు .

వాస్తవానికి ఎస్వీబీసీ బోర్డులో చైర్మన్ తో పాటు టీడీపీ పాలకమండలి సభ్యులను డైరెక్టర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తుంది . కానీ ప్రభుత్వం ఈసారి ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికి ఇతరులకు అవకాశం కల్పించింది . యాంకర్ స్వప్న తొలుత దూరదర్శన్ , టీవీ 9 లో పనిచేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు . టీవీ 9 లో దాదాపు పదేళ్లకు పైగా పనిచేసి తరువాత సాక్షి ఛానల్లో చేరారు . కొన్నాళ్లు అందులో పనిచేసి బయటకి వచ్చినా సాక్షీకి కన్సెల్టెంట్ గా పనిచేయడం విశేషం .

ప్రస్తుతం 10 టీవీలో పనిచేస్తున్న స్వప్న సొంతంగా ఓ వెబ్ చానల్ నడుపుతున్నారు . దీనిద్వారా జగన్ మీద విధేయతా చాటుకుంటూనే ఉన్నారు . నాటి టీడీపీ ప్రభుత్వాన్ని తన ఇంటర్వ్యూల ద్వారా ఇరుకున పెట్టి జగన్ కు అనుకూలంగా వ్యవహరించారు . ఎన్నికల సమయంలో జగన్ కి ఉడతా భక్తిగా సాయంచేసి అధికారంలోకి రావడానికి సహకరించారు . తనపై ఉడతాభక్తి చాటుకున్న స్వప్నాకు ఎస్వీబీసీ లో.డైరెక్టర్ పదవి కట్టబెట్టి జగన్ రుణం తీర్చుకున్నారనే వాదన వినిపిస్తుంది .

Comments