ఏపీలోని టీడీపీ కార్యాలయం నిర్మాణ సంస్థకు నోటీస్ జారీ అయింది. మంగళగిరి
దగ్గర పోరంబోకు స్థలాన్ని పూడ్చి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్న ఎస్ఆర్ఆర్
సంస్థకు రెవెన్యూ శాఖ నోటీస్ జారీ చేసింది. వారం రోజుల్లోగా ఆ స్థలాన్ని
ఖాళీ చేయాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో
హెచ్చరించింది.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment