Skip to main content

సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణ రేపు పునఃప్రారంభం



దాదాపు ఏడు దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య రామజన్మభూమి, బాబ్రీమసీదు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే ఘడియలు మరెంతో దూరంలో లేవు! కొన్నాళ్లుగా అయోధ్య కేసు సుప్రీంకోర్టులో శరవేగంతో విచారణ జరుగుతోంది. అక్టోబరు 17 లోపు ఇరువర్గాలు వాదనలు వినిపించడం పూర్తిచేయాలని సుప్రీం ఇప్పటికే తేల్చి చెప్పింది.

ఈ నేపథ్యంలో కోర్టుకు దసరా సెలవులు రావడంతో విచారణకు విరామం వచ్చింది. ఇప్పుడు వారం రోజుల దసరా విరామం అనంతరం మరోసారి కేసు విచారణ షురూ కానుంది. రేపటినుంచి సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణ జరగనుంది.   

Comments