Skip to main content

బెజవాడ అభిమాన సంద్రంలో మహేశ్ బాబు ఉక్కిరిబిక్కిరి!

 



టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేశ్ బాబు ముందు వరుసలో ఉంటారు. ఆయన పబ్లిక్ లోకి వస్తే ఇసుకేస్తే రాలనంతగా జనాలు వస్తారు. తాజాగా విజయవాడలో ఆ విషయం నిరూపితమైంది. ఎంజీ రోడ్డులో కొత్తగా స్థాపించిన భీమ జ్యుయెలరీ షోరూం ప్రారంభోత్సవానికి మహేశ్ బాబు విచ్చేశారు. ఆయన రాకతో అభిమానులు పోటెత్తారు. షోరూం పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి. అభిమానులను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ, భీమ జ్యుయెలరీ సంస్థ త్వరగా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. బెజవాడ తనకు ఎప్పుడూ ప్రత్యేకం అని, తన కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి  వస్తోందని, ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు.

Comments