ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసిపీకి త్వరలో ఓ కీలక నేత పార్టీకి గుడ్ బై కోట్టనున్నారు. ఆ కీలక నేత ఎవరో కాదు ఎన్టీఆర్ అల్లుడు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన భార్యతో కలిసి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారు.
త్వరలో ఆయన వైసిపీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సంబంధించిన చర్చలు జరిపారు. ఓ మంచి ముహూర్తం చూసి బీజేపీ కండువా కప్పుకోనున్నారు. వైసిపీ ప్రభుత్వం మీద పురంధేశ్వరి విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో దగ్గుబాటి నుంచి ఏలాంటి రియాక్షన్ లేవు.
పురంధేశ్వరిని కూడా వైసిపీ లోకి తీసుకు రావాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసిపీ పెద్దలు సూచించినట్లు తెలిసింది. అయితే భార్య భర్తలు ఇద్దరూ జగన్ వద్ద చేరడం కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడం మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో పని చేయడం దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కొత్తమి కాదు. గతంలో బిజెపితో కలిసి పని చేశారు.
Comments
Post a Comment