మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
నడుస్తోంది. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. చంద్రుడిపైకి రాకెట్ పంపినంత
మాత్రాన మహారాష్ట్ర ప్రజల కడుపు నిండుతుందా? అని ప్రశ్నించారు. దేశ ప్రజలు
అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆర్టికల్ 370,
చంద్రయాన్-2 గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఓవైపు
నిరుద్యోగంతో యువత బాధపడుతుంటే చందమామను చూడాలంటూ సలహాలు ఇస్తున్నారని
మండిపడ్డారు. మోదీ, అమిత్ షా ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్లిస్తున్నారని
రాహుల్ ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల ఎవరు లాభపడ్డారో ప్రధాని మోదీ
చెప్పాలని నిలదీశారు. లాతూర్ జిల్లాలో ఎన్నికల సభ సందర్భంగా రాహుల్ గాంధీ
పైవ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment