గ్రామ/వార్డు సచివాలయాల నియామక ప్రక్రియ పూర్తికావడంతో.. ఆ పోస్టుల్లో ఇంకా మిగిలిన పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి సారించింది జగన్ సర్కార్. ఈ మేరకు గ్రామ వాలంటీర్ల పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ జారీచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెల్సింది.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ/పట్టణ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ జూలైలో ఇంటర్వ్యూలో నిర్వహించి.. మొత్తం 1,94,592 గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. వారిలో 1,84,944 మంది మాత్రమే విధుల్లో చేరగా.. 9,648 ఖాళీలు ఏర్పాడ్డాయి. ఈ పోస్టుల భర్తీకి వీలైనంత త్వరలో నోటిఫికేషన్ జారీచేసి నియామకాలు చేపట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Comments
Post a Comment