Skip to main content

బాలయ్యపై జగన్ ఫోకస్ ..... ఈసారి ఎలాగైనా !



సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది ఏకంగా 151 సీట్లు దక్కించుకుని సరికొత్త విజయాన్ని నమోదుచేసుకుంది . ఇక రాయలసీమలో కడప , కర్నూలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. చిత్తూరు , అనంతపురం జిల్లాల్లో మాత్రం ఆ రికార్డును దక్కించుకోలేకపోయింది . దీంతో ఆ రెండు జిల్లాలపై ఫోకస్ పెట్టారు జగన్ . వచ్చే ఎన్నికలనాటికి ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారట . ఆదిశగా వ్యూహాలు సిధ్ధం చేసుకుంంటున్నారంట .

ముఖ్యమంగా నందమూరి బాలయ్య నియోజకవర్గంపైనా జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారంట .
వైయస్సార్సీపీ గాలిని కూడా నందమూరి బా‌లయ్య తట్టుకుని హిందూపురం నుంచి రెండోసారీ ఎమ్మెల్యేగా గెలిచారు . పాత ఇంచార్జ్ ను మైనార్టీ వ్యుహంతో మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ ను బరిలోకి దింపి ... వైయస్సార్సీపీ ఎన్నికలకి వెళ్లినా వర్కౌట్ కాలేదు . దీంతో ఈసారి ఎలాగైనా హిందూపురంలో పాగావేయాలని భావిస్తున్నారట అందుకే బాలయ్య నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారట . హిందూపూర్ లో మైనార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్నికల్లో ఓడిపోయినా ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు .

ఇక్బాల్ కూడా హిందూపురంలో దూసుకుపోతున్నారట ఎమ్మెల్సీ హోదాలో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారంట . ఇటు బాలయ్య కూడా సినిమాల్లో బిజీగా ఉండటంతో హిందూపురం వైపు పెద్దగా వెళ్లడంలేదని దీనిని క్యాష్ చేసుకునేందుకు వైయస్సార్సీపీ పావులు కదుపుతుందని లోకల్ గా టాక్ నడుస్తుంది . టీడీపీలో ఉండే ద్వితీయ శ్రేణి కార్యకర్తలను
తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది . మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి . హిందూపురంపై పట్టుసాధించుకోవాలనే పట్టుదలతో ఉంది మరి వైయస్సార్సీపీ వ్యూహాలకు బాలయ్య టీడీపీ నేతలు ఎలా చెక్ పెడతారన్నదే ఆశక్తిగా మారింది .
ఇటు అనంతపురం జిల్లానుంచి గెలిచిన మరో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆయన నియోజక వర్గం ఉరవకొండపై కూడా వైయస్సార్సీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది . మాజీ ఎమ్మెల్యే విశ్వేశర్ రెడ్డి మళ్లీ రంగంలోకి దిగారు . నియోజకవర్గంలో మళ్లీ యాక్టీవ్ అవుతున్నారు . ఇటీవలే ఓ నీటి వివాదంతో నియోజకవర్గం ఒక్కసారిగా వేడెక్కింది . మొత్తంమీద జగన్ వైయస్సార్సీపీ అనంతపురం జిల్లాను ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉందట .

Comments

Popular posts from this blog

రేపు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ రేపు దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జగన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఆపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కాగా, సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.

ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదు: రేవంత్ రెడ్డి

  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిసి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంపై వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాదులోని జలసౌధ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని అనుమతులు పొందిందని, ఎంతో తక్కువ ఖర్చుతో నికర జలాలను ఇవ్వగలిగిన ఈ ప్రాజెక్టును తొక్కిపెట్టి మీరు సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో మీరు వేసిన కేసులోనూ ఈ ప్రాజెక్టు వివరాలు పొందుపరచకపోవడం మీ దుర్మార్గానికి పరాకాష్ఠ అంటూ మండిపడ్డారు. అంతేకాదు, ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదని, పొరుగు రాష్ట్రాలేవీ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని రేవంత్ స్పష్టం చేశారు.