తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చడం, ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం సంక్షోభాన్ని మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి ప్రాణత్యాగం తనను ఎంతో బాధించిందని ట్వీట్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులను ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లోకి నెట్టకుండా ఉండాల్సిందని టీఆర్ఎస్ ప్రభుత్వానికి పవన్ హితవు పలికారు. ఇకనైనా ఈ సంక్షోభానికి ప్రభుత్వం ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment