Skip to main content

శ్రీను మాస్టర్ ఇక లేరు



టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. చెన్నైలోని టి నగర్‌లో ఉన్న స్వగృహంలో ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
1969లో నేనేంటే నేనే చిత్రంతో డ్యాన్స్ మాస్టర్‌గా శ్రీను ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. ఆ తరువాత మహా బలుడు, భక్త కన్నప్ప, దొరబాబు, ఎదురులేని మనిషి, యుగంధర్, యుగ పురుషుడు సహా మొత్తం 1700 చిత్రాలకు ఆయన పనిచేశారు. స్వర్ణ కమలం, రాధా గోపాలం, శ్రీరామరాజ్యం చిత్రాలకు గానూ బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ఆయన నంది అవార్డులను అందుకున్నారు.

Comments