Skip to main content

రాఫెల్ యుద్ధ విమానంపై 'ఓం' రాశాను: రాజ్ నాథ్ సింగ్

 


రాఫెల్ యుద్ధ విమానంపై తాను 'ఓం' అని రాశానని, దానికి 'రక్షా బంధన్' కట్టానని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ రోజు ఆయన హర్యానాలోని కర్నాల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చేసిన విమర్శలపై స్పందించారు. 'దేశంలో కాంగ్రెస్ నేతలు రాఫెల్ విషయంపై వివాదం రేపుతున్నారు. దేశానికి రాఫెల్ యుద్ధ విమానాలు వస్తున్న విషయాన్ని వారు స్వాగతించాల్సిందిపోయి, అందుకు విరుద్ధంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు పాకిస్థాన్ కు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి' అని వ్యాఖ్యానించారు.

'మన వద్ద ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే, ఉగ్రవాదులపై దాడులు జరపడానికి మనం బాలాకోట్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. అక్కడి ఉగ్రవాద శిబిరాలను మనం ఇక్కడి నుంచే రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా నాశనం చేసే వాళ్లం' అని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాగా, ఇటీవల ఫ్రాన్స్ లో పర్యటించిన ఆయన.. తొలి రాఫెల్ విమానాన్ని అధికారికంగా అందుకుని, దానికి ఆయుధ పూజలు చేసిన విషయం తెలిసిందే. యుద్ధ విమానాలకు పూజలేంటంటూ దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.