Skip to main content

బిగ్‌బాస్‌3: మహేశ్‌ ఎలిమినేట్‌

 
బిగ్‌బాస్‌3: మహేశ్‌ ఎలిమినేట్‌
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌: సీజన్‌3’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నఈ షో చివరి దశకు వచ్చేసింది. ప్రతి వారం హౌస్‌ నుంచి ఒక్కొక్కరూ ఎలిమినేట్‌ అవుతుండగా, ఈ వారం హాస్యనటుడు మహేశ్‌ విట్టా బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. 
ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే వారి జాబితాలో వరుణ్‌ సందేశ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, మహేశ్‌ విట్టాలు నామినేట్‌ అయ్యారు. నామినేషన్‌లో ఉన్న ముగ్గురూ బలమైన పోటీదారులే. అయితే, రాహుల్‌, వరుణ్‌లతో పోలిస్తే, మహేశ్‌కు కాస్త ఫాలోయింగ్‌ తక్కువ. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు మహేశ్‌కు పడటంతో ఈ వారం ఆయన ఎలిమినేట్‌ అయ్యారు. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్‌, శివ జ్యోతి, రాహుల్‌, వరుణ్‌ సందేశ్‌, వితిక, అలీ రెజాలు మాత్రమే ఉన్నారు. అందరూ బలమైన పోటీదారులే.  ఈ నేపథ్యంలో వచ్చే వారం ఎవరెవరు నామినేట్‌ అవుతారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. 

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here