Skip to main content

రాష్ట్ర బంద్.. కేసీఆర్ కి వార్నింగ్ బెల్స్



ణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె తీవ్రరూపు దాల్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు పట్టు వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట పట్టిన ఆర్టీసీ జేఏసీ.. తమ ఉద్యమాన్ని ఇక తెలంగాణ సాధన ఉద్యమ పంథాలో జరపాలని నిర్ణయించింది. ఇందులో బాగంగా ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై వంటావార్పు, 14న బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న ర్యాలీలు, 17న ధూంధాం, 18న బైక్ ర్యాలీలు చేపట్టాలని నిశ్చయించారు. అలాగే ఈనెల 19న రాష్ట్ర బంద్ కి పిలుపు నిచ్చారు.
కాగ ఆర్టీసీ జేఏసీ పిలుపిచ్చిన రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమాక్ర స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులను అనుయాయులకు కట్టబెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ఉద్యోగులను కుక్కతోకతో పోల్చడం దారుణమన్నారు

Comments