పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిద్వార్‌లో పర్యటిస్తున్నారు. గత రెండ్రోజుల నుంచి ఆయన హరిద్వార్, రిషికేశ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు ఆయన ఉదయాన్నే గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హరిద్వార్‌లోని సాధారణ హోటల్ రూమ్‌లో ఆయన బస చేసి.. స్థానిక ఆశ్రమంలో ఆకులో అల్పాహారం, భోజనం చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గంగానది ప్రక్షాళన కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి మద్దతు రావడంలేనందు వల్లే.. ఆ లోటును తీర్చాలని మాత్రి సదన్ ఆశ్రమ ప్రతినిధులు తనను కోరారని.. అందుకనే.. నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చానని చెప్పారు. కాగా హరిద్వార్ వెళ్లిన ఆయన అక్కడి పవన్ ధామ్ ఆశ్రమంలో బస చేశారు. తాను ఓ సెలబ్రిటీ అయినా ఎంతో సాదాగా ఉన్న గదిలో గడిపారు
Comments
Post a Comment