Skip to main content

కోడెల కుటుంబసభ్యుల స్టేట్ మెంట్లు రికార్డు చేసిన తెలంగాణ పోలీసులు!

 

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి అనంతరం విచారణకు హాజరు కావాలని ఆయన కుమారుడు శివరాంప్రసాద్ కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, ఈ నోటీసులకు శివరాం స్పందించలేదు. దీంతో, బంజారాహిల్స్ పోలీసులు గుంటూరు వెళ్లారు. కోడెల భార్య, శివరామ్ స్టేట్ మెంట్లను రికార్డు చేశారు. తన తండ్రితో తనకు ఎలాంటి గొడవలు లేవని, ఒత్తిడి కారణంగానే ఆయన బలవన్మరణం చెందారని చెప్పినట్టు సమాచారం.

తన తండ్రి మృతి చెందడానికి ముందే తాను విదేశాలకు వెళ్లానని, ఆయన మృతి వార్త తన కుటుంబసభ్యులు చెబితేనే తెలిసిందని పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో శివరామ్ పేర్కొన్నట్టు తెలిసింది. తన భర్త ఎప్పుడూ దేనికీ భయపడే వ్యక్తి కాదని, పోలీస్ కేసులతో తన భర్తను ఇబ్బంది పెట్టారని పోలీసులకు కోడెల భార్య చెప్పినట్టు సమాచారం.   

Comments