Skip to main content

చంద్రబాబు కొడుకు... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఘాటు విమర్శలు చేశారు. ప్రజలు ఛీత్కరించినా, మాడు పగలకొట్టినా ఆయనలో మార్పు రావడం లేదన్నారు. ఓటమికి కారణాలను సమీక్షించుకోకుండా అర్థపర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. గాడితప్పిన వ్యవస్థలను సీఎం జగన్ సరిచేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

సీఎం జగన్‌ను రౌడీ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించడంపై కొలుసు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని కాపాడడమే ఉన్మాదమా అని ప్రశ్నించారు. నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినందుకు సీఎం సైకోలా కనిపిస్తున్నారా అంటూ నిప్పులు చెరిగారు. ఎప్పుడైనా కనీసం 10 వేల ఉద్యోగాలిచ్చావా అని ప్రశ్నించారు. పింఛన్లు ఇంటి వద్దనే అందజేస్తామంటే తప్పుగా కనిపిస్తోందా అని నిలదీశారు. ఓర్వలేకనే అనవసర విమర్శలు చేస్తున్నారని పార్థసార్థి మండిపడ్డారు.

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here