Skip to main content

చిరు వెంటే గంటా...!?

ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టినపుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద దిక్కుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరించిన సంగతి తెలిసిందే. గంటా పార్టీ పటిష్టత కోసం తన వంతుగా క్రుషి చేశారు. దాని ఫలితంగా విశాఖ జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దక్కారు. ఇక ఈ బలంతోనే గంటా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినపుడు మంత్రి పదవి సంపాదించారు. తరువాత చిరంజీవి రాజకీయ జీవితం అగిపోయింది.
గంటా మాత్రం తన సైన్యంతో టీడీపీలో చేరి అక్కడ కూడా మంత్రి పదవి సంపాదించారు. ఇలా ఏడేళ్లకు పైగా మంత్రిగా పనిచేసిన గంటాకు తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమితో బ్రేక్ వచ్చిపడింది. ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.అయితే ఆయన ఎపుడు చేరుతారు ఏంటన్నది ఇంకా తేలలేదు. కానీ ఇపుడు ఆయన చిరంజీవిని పట్టుకుని తిరుగుతుండడం వెనక మతలబు ఏంటన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు.
సైరా సక్సెస్ ఫంక్షన్ సందర్భంగా మెగా నిర్మాత అల్లు అరవింద్ మెగా పార్టీ ఇస్తే దానికి హాజరైన గంటా సందడి చేశారు. ఇక మహా నటుడు ఎస్వీయార్ విగ్రహావిష్కరణ తాడేపల్లిగూడేంలో జరిగితే చిరంజీవి వెంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన పక్కనే నడుస్తూ కనిపించారు. ఇలా చిరంజీవిని పట్టుకుని తిరగడంతో గంటా వ్యూహం ఏంటి అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు.

కొంపదీసి చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా, గంటా రాజకీయ మంతనాలు కూడా చేస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా గంటా ఇపుడు మెగా పార్టీలో ఉన్నారని అర్ధమైందంటున్నారు. ఏది ఏమైనా గంటా ఆలోచనలు, వ్యూహాలు ఎవరికీ అర్ధం కావని అంటున్నారు. అందువల్ల వెయిట్ అండ్ సీ.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.