ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే. మోదీతో భేటీ అనంతరం ఆ వివరాలను మీడియాకు చెప్పకుండానే జగన్ వెళ్లిపోయారు. దీనిపై ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తామని చెప్పిన జగన్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదని విమర్శించారు.
ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ ఒక్క ప్రయత్నం కూడా చేయడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర సమస్యలు చెప్పడానికి వెళ్లారో? తనపై ఉన్న కేసుల మాఫీ కోసం వెళ్లారో? అంటూ జగన్ పై విమర్శలు చేశారు.వెంకటాచలం ఎంపీడీవో సరళపై ఎమ్మెల్యే కోటంరెడ్డి దౌర్జన్యం చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రౌడీయిజం చేస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని అని ప్రశ్నించారు.
Comments
Post a Comment