Skip to main content

వైసీపీ వెనక్కి తగ్గిందా? కరకట్టపై కూల్చివేతలు ఆగినట్లేనా?

ఏపీలో అధికారంలోకి రాగానే... వైసీపీ ప్రభుత్వం అత్యంత ఆవేశంగా... టీడీపీ అప్పటివరకూ వాడుకున్న ప్రజావేదికను కూల్చివేసింది. రూ.40 కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనాన్ని నేలమట్టం చెయ్యడమే కాక... కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తామని ప్రకటించింది. ఆ ప్రకారమే... ఇటీవల అధికారులు... టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్న ఇల్లు సహా... అక్రమ నిర్మాణాలకు నోటీసులు పంపారు. వారంలోగా ఖాళీ చెయ్యాలన్నది ఆ నోటీసుల్లో సారాంశం. దాంతో ఈ విషయం రాజకీయంగా కలకలం రేపింది. అక్రమ నిర్మాణాల్ని కూల్చేయాలని వైసీపీ నేతలు, కూల్చడానికి వీల్లేదని టీడీపీ నేతలూ వాదించారు. ఇంతలో... వారం గడిచిపోయింది. మరో మూడ్రోజులు కూడా అయిపోయాయి. కానీ... కూల్చివేతలు మాత్రం మొదలవ్వలేదు. కారణమేంటి? కూల్చివేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన వైసీపీ ఇప్పుడు ఎందుకు సైలెంటైపోయింది?

వైసీపీ మౌనం వెనక టీడీపీ రాజకీయ ఎత్తుగడ ఉందని తెలుస్తోంది. కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలున్న కొందరు టీడీపీ నేతలు... ఇటీవల బీజేపీలో చేరారు. తమ ఇళ్లను కూల్చనివ్వకుండా అడ్డుకోవాలని పార్టీ హైకమాండ్‌ని కోరారని తెలుస్తోంది. దాంతో బీజేపీ హైకమాండ్ నుంచీ వైసీపీ ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయనీ... అందువల్లే వైసీపీ సర్కార్ సైలెంటైపోయిందనే వాదన వినిపిస్తోంది. ఇంతకుముంది కరెంంటు ఒప్పందాల విషయంలో కేంద్రానికి ఎదురుతిరిగిన వైసీపీ ప్రభుత్వం... ఆ తర్వాత మెత్తబడక తప్పలేదు. ఇప్పుడు కరకట్ట విషయంలోనూ కేంద్రం అనధికారిక ఆదేశాలు... వైసీపీ దూకుడుకి బ్రేక్ వేశాయనే వాదన ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.

ముందుంది కూల్చివేత పండుగ : కూల్చివేతలకు బ్రేక్ పడిందనీ, వైసీపీ తమ దారికి వచ్చిందని ఓవైపు టీడీపీ నేతలు చెప్పుకుంటుంటే... అంత లేదంటున్నాయి వైసీపీ వర్గాలు. దసరా సెలవులు కావడంతో... ఏపీలో ప్రజలంతా పండుగ మూడ్‌లో ఉంటారు కాబట్టి... ఇలాంటి సమయంలో... కూల్చివేతలూ అవీ చేస్తే... వాటిని అడ్డుకునేందుకు టీడీపీ ఏ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకో పిలుపిస్తే... లేనిపోని లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని భావించిన ప్రభుత్వం... పండగ తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని డిసైడైనట్లు తెలుస్తోంది. కాబట్టి టీడీపీ నేతల ఆనందం... ఈ నాల్రోజులే అంటున్నాయి వైసీపీ వర్గాలు. కేంద్ర పరిధిలో కరెంటు ఒప్పందాలు... ఇదివరకే కుదరడం వల్ల... ఆ విషయంలో తమ అధినేత వెనక్కి తగ్గారే తప్ప... కేంద్రానికి తలొగ్గి కాదనీ... అక్రమ నిర్మాణాల్ని కూల్చివేసిన తర్వాత... టీడీపీ నేతలకు తత్వం బోధపడుతుందని అంటున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...