నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంత పార్టీ నేతల మీదే సంచలన వ్యాఖ్యలు చేశారు.. తన అరెస్ట్ వెనుక పార్టీలోని కొందరి పాత్ర ఉందంటూ ఆరోపించారు.. వెంకటాచలం ఎంపిడిఓ సరళ నివాసంపై దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు..
అనంతరం బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర దాగుందన్నారు.. పార్టీ నుంచి తనను దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎంపిడిఓ సరళ ఇంటిపై తాను దాడికి పాల్పడలేదన్నారు.. తాను తప్పు చేశానని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు.. ఇదే సమయంలో ఆయన కొన్ని ఆరోపణలు చేశారు.. అధికారుల తీరుపై మండిపడ్డారు.. ఎంపీడీవో చేసిన ఆరోపణల్లో తన పాత్ర ఉందని తేలితే... షోకాజ్ నోటిస్ ఇవ్వకుండానే పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేయ్యమని సీఎం జగన్ ఆదేశిస్తే.. కొందరు ఉన్నతాధికారులు పక్షపాతంగా
వ్యవహరించారన్నారు..
ఎంపీడీవో ఇంటిపై దాడికి పాల్పడ్డానని నిరూపిస్తే ఆమెకు క్షమాపణ చెబుతానని ప్రకటించారు. సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు గర్వపడుతున్నానన్న కోటంరెడ్డి... ఎవరెన్ని కుట్రలు చేసినా.. తాను నిరంతరం ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు..తాను ఎంపిడిఓ ఇంటిపై దాడి చేశానని చెప్పినప్పుడు ఆవిడ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి గాని...సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి ఇంటికి ఎందుకు వెళ్ళిందని ఆయన ప్రశ్నించారుచట్టానికి ఎవరు అతీతులు కాదని సీఎం జగన్ చెప్పడాన్నీ స్వాగతిస్తున్నాన్న ఎమ్మెల్యే..మాది నిజమైన ప్రభుత్వమని.. ప్రమాణస్వీకార సమయంలో జగన్ చేసిన ప్రమాణాన్ని తూచా తప్పకుండా పాటింస్తున్నారన్నారు.
తనకు, జిల్లా ఎస్పీ కి విభేదాలు ఉన్నాయన్నారు. ఇదే విషయంపై నాలుగు రోజుల క్రితం కలెక్టర్ కి ఫిర్యాదు చేశానని వివరించారు..ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోమని సీఎం చెబితే.. ఎస్పీ వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేసారని ఆరోపించారు. అర్ధరాత్రి తన ఇంటిపై, అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి ఇంటిపై దాడులు చేసి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు..
Comments
Post a Comment