Skip to main content

ఏపీ డిప్యూటీ సీఎం,కలెక్టర్ కలిసి సినిమాలో నటిస్తున్నారంట


credit: third party image reference
ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మరియు కలెక్టర్ హరిజవహర్ లాల్ ఇద్దరు ఒక సినిమాలో నటించనున్నారు.విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని లోవముఠా ప్రాంతం గొరడలో మూవీ షూటింగ్ జరుపుతున్నారు.ఒక వైపు సినిమా లో నటిస్తూనే మరో వైపు తమ నిధులను నిర్వహిస్తున్నారు.
credit: third party image reference


ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను తెలుపుతూ అమృత భూమి అనే సినిమా చేస్తున్నారు.ప్రజలకు సందేశం ఇచ్చే సినిమా కాబట్టి డిప్యూటీ సీఎం నటించిటానికి ఒప్పుకున్నారు.కలెక్టర్ కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తునరని చెప్పారు.పుష్ప శ్రీవాణి ఒక టీచర్ కారెక్టర్ చేస్తున్నారు.ఈ సినిమాకి ప్రముఖ రచయిత వంగపండు ప్రసాదరావు కథను అందించారు.

Comments

Popular posts from this blog

రేపు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ రేపు దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జగన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఆపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కాగా, సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.

ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదు: రేవంత్ రెడ్డి

  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిసి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంపై వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాదులోని జలసౌధ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని అనుమతులు పొందిందని, ఎంతో తక్కువ ఖర్చుతో నికర జలాలను ఇవ్వగలిగిన ఈ ప్రాజెక్టును తొక్కిపెట్టి మీరు సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో మీరు వేసిన కేసులోనూ ఈ ప్రాజెక్టు వివరాలు పొందుపరచకపోవడం మీ దుర్మార్గానికి పరాకాష్ఠ అంటూ మండిపడ్డారు. అంతేకాదు, ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదని, పొరుగు రాష్ట్రాలేవీ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని రేవంత్ స్పష్టం చేశారు.