Skip to main content

సడెన్‌గా బ్యాంకాక్‌కి రాహుల్ గాంధీ... కారణం అదేనా...



 ఈ నెల చివర్లో ఎన్నికలు జరగబోయే... మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఇలాంటి సమయంలో... పోరాడాల్సిన ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ... శనివారం సడెన్‌గా బ్యాంకాక్ ట్రిప్‌కి వెళ్లిపోయినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీయే అధికారంలో ఉంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కూడా రెండు రాష్ట్రాల్లో బీజేపీయే దుమ్మురేపింది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తోడుగా ఉంటూ... పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉంది. ఆల్రెడీ మొన్నటిదాకా పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉన్నందువల్ల... నేతలు కూడా రాహుల్ సరైన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తుంటే... ఆయనేమో... బ్యాంకాక్ వెళ్లిపోవడం... రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.