Skip to main content

జగనే అరెస్ట్ చేయించారు... మా నేతంటే అంతే...: బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత కోటంరెడ్డి!

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరు
చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నది తమ అధినేత వైఎస్ జగన్ నమ్మకమని, ఆ నమ్మకమే తనను అరెస్ట్ చేయించిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీడీఓ సరళ పెట్టిన కేసులో ఈ తెల్లవారుజామున కోటంరెడ్డిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లిన అధికారులు, ఆపై ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, బెయిల్ మంజూరైంది.

అనంతరం మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి, ఆధారాలుంటే, తమ పార్టీ నాయకుడైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారని, అటువంటి వ్యక్తి కలకాలం పాటు రాష్ట్రానికి సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అయినా విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

ఈ కేసులో పూర్తి విచారణ జరిపించాలని పోలీసులను కోరుకుంటున్నానని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తన దురదృష్టం కూడా ఉందని, జిల్లా ఎస్పీకి, తనకు విభేదాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందేనని, డీజీపీ నుంచి ఆదేశాలు రాగానే ఆయన ఏ మాత్రమూ విచారించకుండా తనను అరెస్ట్ చేయించారని కోటంరెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందు కూడా ఆయన తనను అదే విధంగా ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎన్నికల తరువాత కూడా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

నాలుగు రోజుల క్రితమే ఈ విషయమై కలెక్టర్ కు తాను ఫిర్యాదు చేశానని చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తమ అధినేత నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే, ఆదేశాలు వచ్చిన గంటలోపే తనను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఓ శాసన సభ్యుడనైన తాను ఎక్కడకు పారిపోతానని అంత హడావుడిగా అరెస్ట్ చూపించాల్సి వచ్చిందని మండిపడ్డారు. తనకు ఫోన్ చేసి పిలిచినా స్టేషన్ కు వెళ్లేవాడినని, అరెస్ట్ చేస్తామని చెబితే లొంగిపోయి ఉండేవాడినని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్వేచ్ఛను నెల్లూరు పోలీసులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.