Skip to main content

బస్సును ఆపి యువతి టిక్ టాక్... తెగ వైరల్ అవుతున్న వీడియో

కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సుకు ఎదురెళ్లి, దాన్ని ఆపి, ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తూ టిక్ టాక్ చేసిన ఓ యువతి ఇప్పుడు కష్టాల పాలైంది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో పాటు పబ్లిక్ న్యూసెన్స్ కింద పోలీసులు ఆమెపై కేసును నమోదు చేశారు.

ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పుణె నగరంలో ఆసాబ్ సార్, బైక్రేయి నగర్ మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును ఓ యువతి ఆపింది. ఆపై వెంటనే తనలోని కళాకారిణిని బయటకు తీసి, డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేయడంతో అది తెగ వైరల్ అయింది. దీనిపై స్థానిక పోలీసులు స్పందించి, ఆమెపై కేసును నమోదు చేశారు.

Comments