మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా నేడు తాడేపల్లిగూడెంలో విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ సభ అత్యంత ఘనంగా జరిగింది. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ లో 9 అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహా ఆవిష్కరణ కోసం చిరంజీవి ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు విమానాశ్రయంలో చిరంజీవికి పలు పార్టీలకు సంబంధించిన కీలక నేతలతో పాటు మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి సుమారు 250 కార్లకు పైగా భారీ ర్యాలీతో రోడ్డు మార్గంలో చిరంజీవి తాడేపల్లి గూడెం చేరుకున్న దృశ్యం ఒక పొలిటికల్ రోడ్ షోలా జరిగింది అన్నవార్తలు వస్తున్నాయి.
Comments
Post a Comment