సీఎం కేసీఆర్ తీరుతో పండగపూట ప్రజలు ఇబ్బందిపడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నల్గొండలో ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేయాలని కేసీఆర్ చూస్తున్నారని, సమస్యలు పరిష్కరించకుండా వారిని బెదిరించడం దారుణమని మండిపడ్డారు.
ఉద్యోగుల పట్ల కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వేల కోట్లతో అవసరం లేని భవనాలు కడుతున్న కేసీఆర్ కు ఆర్టీసీని ఆదుకునేందుకు నిధులు లేవా? అని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు తొలిదెబ్బ కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.

Comments
Post a Comment