తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పట్ల సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. పండుగ సీజన్ లో సమ్మెకు దిగిన వారితో రాజీపడేది లేదని, కొత్తగా నియామకాలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి దీటుగా స్పందించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రం సీఎం జగన్ ను చూసి మన రాష్ట్రం నేర్చుకోవాలంటూ కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.
తమ పోరాటంలో ధర్మం, న్యాయం ఉందని, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. తాము కూడా న్యాయపరంగానే ముందుకెళతామని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. అంతకుముందు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ సమ్మెలో పాల్గొన్నవారిపై వేటు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని తెగేసి చెప్పినట్టు సమాచారం.

Comments
Post a Comment