Skip to main content

వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్..


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం ఉదయం పోలీసులకు లొంగిపోయారు. తన ఇంటిపైకి వచ్చి ఎమ్మెల్యే బెదిరించి గొడవ చేసారని మహిళ ఎంపిడివో సరళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు గత రాత్రి నుంచి ప్రయత్నాలు జరిగాయి. ఆయన ఇంటిదగ్గర హైడ్రామా జరిగింది. అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్యే ఇంటిదగ్గర పోలీసులు అయన కోసం వేచి చూశారు. ఆయన లేకపోవడంతో రాత్రి మొత్తం అక్కడే ఉన్నారు.
కాగా ఈ ఉదయం కోటం రెడ్డి డైరెక్ట్ గా పోలీసులకు లొంగిపోయారు. రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది. ప్రైవేట్ అపార్ట్మెంట్ పంచాయితీ పైప్ లైన్ కోసం దరఖాస్తు చేసుకోగా, గ్రామ సచివాలయ పరీక్షల ఉన్నందువలన ఆయన దరఖాస్తుకు సంబంధించిన విషయాలను పరిశీలించేందుకు ఆలస్యం అయ్యింది. దీంతో ఆయన ఎంపిడివో ను బెదిరించారట. దీంతో ఆమె తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పు చేస్తే ఎవరైనా సరే ఒక్కటే అని ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి జగన్ కూడా చెప్పడంతో ఆయనపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధం అయ్యారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.