Skip to main content

ఫరూ‌క్ అబ్దుల్లాను కలిసిన ఎన్సీ ప్రతినిధి బృందం


జమ్మూ: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ఆ పార్టీకి చెందిన 15 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఆదివారంనాడు కలుసుకుంది. రెండు నెలలుగా గృహనిర్బంధంలో ఉన్న ఫరూక్‌ను ఆయన నివాసంలో ప్రతినిధి బృందం కలుసుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత దేవేందర్ సింగ్ రాణా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇవాళ ఉదయం శ్రీనగర్‌కు చేరుకుని నేరుగా ఫరూక్ నివాసానికి వెళ్లింది. ఫరూక్‌ను కలుసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఎన్సీ ప్రతినిధి బృందం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కోరడంతో ప్రభుత్వ యంత్రాగం అందుకు అనుమతించింది.

Comments