Skip to main content

సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి

తమ ఉద్యోగాలను కూడా పణంగా పెట్టి నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల భాగస్వామ్యం విస్మరించలేనిదని, ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆర్టీసీ ఉద్యోగులు కూడా పోరాడారని రేవంత్ వెల్లడించారు.

టీఆర్ఎస్ పార్టీ చీఫ్ హోదాలో ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని మీరు కూడా అభినందించారని, తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో మార్పు తెస్తానని హామీ ఇచ్చారని కేసీఆర్ కు గుర్తు చేశారు. "ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేసిన వారిలో మీరు కూడా ఉన్నారు. కానీ మీరు పాలన చేపట్టాక ఆర్టీసీని పట్టించుకోవడం మానేశారు. సీఎం అయ్యాక ఊసరవెల్లి స్థాయిలో రంగులు మార్చేశారు" అంటూ విమర్శించారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.