టీఎస్సార్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేశారు. కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధంగా లేవని, సమ్మె చట్టబద్ధం కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయం కల్పించామని న్యాయమూర్తికి వివరించారు.
తెలంగాణలో అన్ని ఆర్టీసీ డిపోల వద్ద వాస్తవ పరిస్థితులపై ఈ నెల 10న నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సమ్మెపై కౌంటర్ దాఖలు చేయాలని టీ-సర్కార్ కు, ఆర్టీసీ యాజమాన్యానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో అన్ని ఆర్టీసీ డిపోల వద్ద వాస్తవ పరిస్థితులపై ఈ నెల 10న నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సమ్మెపై కౌంటర్ దాఖలు చేయాలని టీ-సర్కార్ కు, ఆర్టీసీ యాజమాన్యానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Post a Comment