రాజమండ్రి: రాయల్ వశిష్ట బోటు వెలికితీతపై టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. బోటు ప్రమాదాన్ని ఇప్పటికీ కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. విషాద ఘటనపై రాజకీయాలు వద్దన్నారు. తనకు బోటు ఉన్నట్లు నిరూపిస్తే దానిని రాసిచ్చేస్తానన్నారు. బోటు వెలికితీతపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. బోటును బయటకు తీసే వరకూ మానవ ప్రయత్నాలు కొనసాగిస్తామని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Comments
Post a Comment