ఏపీ మంత్రి కన్నబాబు గోదావరి బోటు మునక ఘటనపై మీడియాతో మాట్లాడారు. కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన బోటుకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉందని వెల్లడించారు. అయితే వరద ఉద్ధృతితో బోటు సుడిగుండంలో చిక్కుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని వివరించారు.
దీనిపై చంద్రబాబు వంటి నేతలు రాజకీయం చేయడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ఆచూకీ లేని వారికి మరణ ధ్రువపత్రం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కన్నబాబు స్పష్టం చేశారు. బోటు ప్రయాణాలపై మాన్యువల్ రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారని కన్నబాబు తెలిపారు. ఇకమీదట బోట్లలో జీపీఎస్, నావిగేషన్ వ్యవస్థలు ఉంటేనే ప్రయాణానికి అనుమతి ఇచ్చే ఆలోచన ఉందని వెల్లడించారు.

Comments
Post a Comment