Skip to main content

ఇండియాకి ర‌జ‌త ప‌తకం తీసుకొచ్చిన మాధ‌వ‌న్ త‌న‌యుడు

త‌న‌యుడు సాధిస్తున్న ఘ‌న‌త‌ల‌ని చూసి తండ్రి మాధ‌వ‌న్ చాలా గ‌ర్విస్తున్నాడు. మాధవన్-సరితల పుత్ర రత్నం వేదాంత్(14) ఆ మ‌ధ్య థాయిలాండ్‌లో జరిగిన‌ అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో ... 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీ పడ్డాడు. మూడో స్థానంలో నిలిచిన వేదాంత్ కాంస్యపతకం అందుకున్నాడు. ఇక రీసెంట్‌గా జాతీయ స్థాయి పోటీలు జ‌ర‌గ‌గా అందులో వేదాంత్ మూడు బంగారు, ఒక వెండి పతకాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ విష‌యాల‌ని గ‌ర్విస్తూ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌కి తెలియ‌జేశాడు మాధ‌వ‌న్.

తాజాగా జ‌రిగిన ఆసియా ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్‌ గ్రూప్ IIలో 4x100మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేలో భారత్ తరుపున వేదాంత్‌తో పాటు మరో ముగ్గురు పోటీలో పాల్గొన్నారు. వేదాంత్‌ (55.27 సె), ఉత్కర్ష్‌ పాటిల్‌ (57.10 సె), సాహిల్‌ లష్కర్‌ (54.83 సె), సోహన్‌ గంగూలీ (54.29 సె)తో కూడిన బృందం 3:41:49 సెకన్లలో పోటీ ముగించి రెండో స్థానం పొందారు. ఇందుకు గాను వారికి సిల్వ‌ర్ మెడ‌ల్ ద‌క్కింది. గ్రూప్ IIలో 4x100మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేలో తొలి స్థానంలో నిలిచిన థాయిలాండ్ స్విమ్మర్లు స్వర్ణ పతకం సాధించగా... మూడో స్థానంలో నిలిచిన జపాన్ స్విమ్మర్లు కాంస్య పతకం సాధించారు. ఇదిలా ఉంటే, గ్రూప్ Iలో 4x100మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేలో భారత స్విమ్మర్లు స్వర్ణ పతకం సాధించారు. మొత్తానికి వేదాంత్ త‌న తండ్రితో పాటు దేశాన్నీ గర్వపడేలా చేశాడు. దేవుడి ద‌య వ‌ల‌న భార‌త్ త‌ర‌పున తొలి ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు. ఆసియా ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్‌ గ్రూప్ II పోటీల‌లో భార‌త్‌కి ర‌జతం ల‌భించింది అని మాధ‌వన్ త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా తెలియ‌జేశాడు. ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు వేదాంత్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.మాధ‌వన్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న ప్ర‌స్తుతం ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్వ‌యంగా తెర‌కెక్కిస్తూ న‌టిస్తున్నాడు మాడి. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నంబి నారాయ‌ణ్ జీవితంలోని మూడు ప్ర‌ధాన కోణాల‌ని చూపించనున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానుండ‌గా,షారూఖ్, సూర్య ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక మాధ‌వ‌న్ భార్య‌గా సిమ్రాన్ క‌నిపించ‌నున్నారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.