వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీపీఏలపై జగన్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాల అని విమర్శించారు. టీడీపీ హయాంలో దురుద్దేశంతోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. నాడు తమ చర్యల వల్లే విద్యుత్ ధర తగ్గిందని అన్నారు. తప్పుడు రికార్డులతో తమపై నిందలు వేస్తున్నారని, ప్రభుత్వ అధికారులు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారం ఇవ్వడానికి అధికారులకు ఎంత ధైర్యం అని ప్రశ్నించారు. చట్టాలను ఉల్లంఘిస్తూ తాత్కాలిక ఆనందం పొందుతున్నారని, తప్పు చేసిన వారు ఎప్పటికైనా శిక్షార్హులే అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, రివర్స్ టెండరింగ్ వల్ల రాష్ట్రానికి రూ.7500 కోట్ల నష్టం అని, ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన లేదని, ఎవరు చెప్పినా వినకుండా, మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు
Comments
Post a Comment