బాక్సైట్ తవ్వకాలను తామే రద్దు చేశామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం పై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగానే విశాఖలో బాక్సౌట్ తవ్వకాలను రద్దు చేశారని ఆమె తెలిపారు. విశాఖ మన్యంలో గిరిజనులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత వైఎస్ఆర్‌సీపీకే దక్కుతుందని ఆమె చెప్పారు. మొత్తం అయిదు జీవోల ద్వార బాక్సైట్ తవ్వకాలకు వైఎఎస్‌ఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు.అయితే చంద్రబాబు నాయుడు బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. చంద్రబాబుతో పాటు ఆయన వర్గానికి పిచ్చి బాగా ముదిరిపోయిందని ఈ సంధర్భంగా విమర్శించారు. వారిని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఎద్దేవా చేసిన ఆమె చంద్రబాబు విధానాల వల్ల ఓ గిరిజన ఎమ్మెల్యే మావోయిస్టుల చేతిలో హతమయ్యారని ఆరోపించారు.విశాఖ ఏజెన్సీలో గత ప్రభుత్వం 30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన బాక్సైట్ తవ్వకాల అనుమతిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.... అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్, జెర్రెల బ్లాక్ , గాలికొండ, చిత్తమగొండి, రక్తికొండ, చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ గ్రామాల్లో బాక్సైట్ అనుమతులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే బాక్సైట్ తవ్వకాలను ఇదివరకే తాము రద్దు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు.గతంలోనే రద్దు చేసిన తవ్వకాలను ఎన్నిసార్లు రద్దు చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment