ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గత ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు రద్దు కానున్నాయి. నూతన ఏజెన్సీలు ఎలా ఉండాలనే దాని పై ఏపీ సర్కార్ ఓ గైడ్ లైన్స్ కమిటిని వేసింది. జీఏడీ కార్యదర్శి చైర్మన్ గా ఈ కమిటిని ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్ధిక, న్యాయ, కార్మిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. నూతన ఏజెన్సీల ఎంపికకు కావాల్సిన విధివిధానాలను ఈ కమిటీ నివేదిక రూపంలో సమర్పించనుంది. 3 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటిని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏజెన్సీలన్నీ రద్దయ్యాయి.

Comments
Post a Comment