చైనాకు చెందిన పారిశ్రామిక దిగ్గజం టీసీఎల్.. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో భారీ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ నిర్మాణ పనులకు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా భూమిపూజ చేశారు. తిరుపతి-శ్రీకాళహస్తి మార్గంలోని ఏర్పేడు మండలం వికృతమాల వద్ద ఈ కంపెనీ నిర్మితం కానుంది. ఈ సంస్థ ప్రారంభ పెట్టుబడి 2,200 కోట్ల రూపాయలు. దీనివల్ల 6, 000మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా మరో 4000 మందికి ఉపాధి అవకాశాలు లభించడానికి అవకాశాలు ఉన్నాయని ఏపీఐఐసీ అధికారులు అంచనా వేస్తున్నారు.చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ ఈ సంస్థకు భూమిని కేటాయించింది. ఈ సంస్థకు కేటాయించిన మొత్తం భూములు 139 ఎకరాలు. గత ఏడాది డిసెంబర్ లో ఈ సంస్థకు చంద్రబాబు భూమిపూజ కోసం చేశారు. భూములను కేటాయించిన కొద్దిరోజుల వ్యవధిలోనే భూమిపూజ చేయడం పట్ల అప్పట్లో విమర్శలు తలెత్తాయి. తాజాగా- గురువారం ఈ సంస్థ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఈ పనులకు రోజా భూమిపూజ చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంస్థలో ఉత్పత్తి ఆరంభమౌతుందని తెలుస్తోంది. భూమిపూజ కార్యక్రమంలో టీసీఎల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అబెల్ ఝియాంగ్ పాల్గొన్నారు.
Comments
Post a Comment