Skip to main content

జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రిపై కేసు

Image result for ayyanna patruduఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదైంది. విశాఖ త్రీ టౌన్ పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపై వైసీపీ నేత వెంకట్రావు ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్నపాత్రుడుపై ఐపీసీ 153ఏ, 500, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Comments