Skip to main content

రాజకీయాలు.. కమల్‌, రజనీకి చిరు సలహా ఇదే!

Stay Out Of Politics, Chiranjeevi Advises Rajinikanth, Kamal Haasan - Sakshi
‘మీరు సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తులైతే.. రాజకీయాల్లోకి రాకండి’.. ఇది మెగాస్టార్‌ చిరంజీవి తన తోటి నటులు రజనీకాంత్‌కమల్‌హాసన్‌కు ఇచ్చిన సందేశం. రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని ఆ ఇద్దరు నటులకు చిరంజీవి సూచించారు. తాజాగా ఆనంద వికటన్‌ అనే మ్యాగజీన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరు.. తన రాజకీయ ప్రస్థానంతోపాటు పలు విషయాలను పంచుకున్నారు. సినీరంగంలో ‘నంబర్‌ వన్‌’ హీరోగా కొనసాగుతున్న సమయంలో ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో తాను గతంలో రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు.‘రాజకీయం అంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. కోట్లాది రూపాయలు ఉపయోగించి నా సొంతం నియోజకవర్గంలోనే నన్ను ఓడించారు. ఇటీవలి ఎన్నికల్లో నా తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కు ఇదే అనుభవం ఎదురైంది’ అని చిరు చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో కొనసాగాలంటే పరాజయాలను, అవమానాలను, అసంతృప్తలను దిగమింగుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ దృఢ సంకల్పం గలవారని, వారు రాజకీయాల్లో కొనసాగాలని నిశ్చయించుకుంటే.. అన్ని సవాళ్లను, అసంతృప్తులను ఎదుర్కొని..ప్రజల కోసం పనిచేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌ హాసన్‌ పార్టీ మంచి ఫలితాలను రాబడుతుందని ఆశించినప్పటికీ.. అది జరగలేదన్నారు. 2008 ఆగస్టులో తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి 2009 ఎన్నికల్లో 294 సీట్లలో పోటీ చేసి.. 18 స్థానాల్లో గెలుపొందారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఆ పార్టీలో చేరారు.

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.