Skip to main content

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌




జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.
 ప్రపంచం ఏం చేసింది?. 

బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు.


యుద్ధం వస్తే మేం సిద్ధం!
ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్సి వస్తే ప్రపంచమంతా బాధ్యత వహించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నిరోధించేందుకే ఐరాస ఉందని విశ్వసిస్తున్నాను. శాంతి, సమానత్వం, మానవతవ్వం కోసం ఆలోచించాల్సిన సమయం ఇది. మార్కెట్, లాభాలు కాదు.. భారత్‌లో ఏడో వంతు మాత్రమే ఉన్న దేశం మాది. తప్పనిసరైతే మనుగడం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేయదలుచుకున్నాం. యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మేం బెదిరించట్లేదు.. మా ఆందోళన మాత్రమే చెబుతున్నాను. ఇలాంటి సమయంలో ఐరాస ఏం చేస్తుంది..? అని ఇదే వేదికగా ఇమ్రాన్ ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.