Skip to main content

శ్రీవారి బ్రహ్మూత్సవాలకు రాజనాధ్‌ కు ఆహ్వానం

ttd welcomeకలియుగ దైవమైన శ్రీవారి అఖిలాండ బ్రహ్మూత్సవాలను తిలకించాలని గురువారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాధ్‌ సింగ్‌కు ఢిల్లీలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ సందర్భంగా టీటీడీలో చేపడుతున్న సంస్కరణలను మంత్రి కొనియాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుమలకు రావడం ఆనందదాయకమన్నారు.

హైందవ సంప్రదాయాలను కాపాడుతూ ప్రజల్లో భక్తి ప్రపత్తులను ప్రోది చేస్తున్న టీటీడీ నిర్ణయాలను ఆయన అభినందించారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులతో జీవిస్తారని రాజ్‌నాధ్‌ సింగ్‌ వ్యక్తం చేశారు.

దేవదేవుని ఆశీస్సులు ప్రజలందరికీ అందించేందుకు చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డికి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.