Skip to main content

విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించి నాసా కీలక చిత్రాలు



విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించే పనిలో ఇస్రోకు అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా సహకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 7న చంద్రుడిపై దిగే సమయంలో విక్రమ్ ల్యాండర్‌‌తో చివరి క్షణాల్లో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి దాన్ని గుర్తించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో రంగంలోకి దిగిన నాసా బృందం.. దాన్ని కనుగొనేందుకు తమవంతు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా విక్రమ్‌కు నిర్దేశించిన ప్రాంతానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ఇవాళ నాసా టీమ్ విడుదల చేసింది. అయితే కాస్త చీకటి ఉండటం వల్ల విక్రమ్‌ను తాము గుర్తించలేకపోయామని.. అక్టోబర్‌లో మరిన్ని చిత్రాలు విడుదల చేస్తామని ట్విట్టర్‌లో పేర్కొంది.

Comments