Skip to main content

శరద్ పవార్ నివాసంలో పోలీసుల సోదాలు..


Image result for SARAD PAWAR

మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరుకానున్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో పోలీసులు ఇవాళ విస్తృత సోదాలు నిర్వహించారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) వినయ్ చౌబే నేతృత్వంలో ఓ బృందం పవార్ 
ఇంటికి వెళ్లగా... పోలీసు జాగిలాలతో మరో బృందం ముంబైలోని ఎన్‌సీపీ కార్యాలయానికి వెళ్లింది. కాగా సోదాల సందర్భంగా ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు జాత్తలన్నీ తీసుకున్నామనీ.. ఇప్పటికే 144 సెక్షన్ విధించామని ముంబై జోన్1 డీజీపీ సంగ్రామ్ సింగ్ నిషాందర్ పేర్కొన్నారు.
 

శరద్ పవార్ ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు గురువారమే ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ 144 సెక్షన్ విధించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈడీ విచారణ ఎదుర్కోనున్న పవార్ నివాసానికి ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కూడా చేరుకున్నారు. ఈ సందర్భంగా మాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎన్సీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇది సరికాదు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు శరద్ పవార్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఈడీ కార్యాలయానికి వెళ్తారు. బీజేపీ ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేస్తోంది....’’ అని పేర్కొన్నారు. రూ.5 వేల కోట్ల మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (ఎంఎస్‌సీబీ) కుంభకోణం కేసులో శరద్ పవార్, అజిత్ పవార్ సహా పలువురు ఎన్సీపీ నేతలపై ఈడీ కేసు నమోదు చేసింది.

Comments