Skip to main content

ఏపీ సీఎం వైయస్ జగన్‌ను కలిసిన ఆర్.నారాయణ మూర్తి..


ఏపీ సీఎం వైయస్ జగన్‌ను కలిసిన ఆర్.నారాయణ మూర్తి..
ర్.నారాయణమూర్తి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను తెరమీద ఆవిష్కరించే  పీపుల్స్ స్టార్. పేదలపై జరుగుతున్న అన్యాయాలను తన సినిమాలో చూపించే హీరో. ఆయన వెండితెర మీద ప్రజాపోరాటాన్ని చూపిస్తున్న ప్రజల స్టార్. పాతికేళ్లుగా పరిశ్రమలో ఉన్నా.. సినిమా సంస్కృతిని ఒంటపట్టించుకోని ముక్కుసూటి మనిషి. తాజాగా ఈయన ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక వినతి పత్రం అందించారు. అందులో తాండవ జలాశయంలోని అదనపు జలాల సమకూర్చడనాకి విశాఖ జిల్లా చిన గోలుకొండపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిని ఏర్పాటు చేసి పైపు లైను ద్వారా రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను అందించాలని కోరారు. నారాయణ మూర్తి వినతిపై  వై.యస్. జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఆర్.నారాయణ మూర్తితో స్థానిక ఎమ్మెల్యేకూడా ఉన్నారు.

Comments