Skip to main content

ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలి: మోదీ

PM Modi UNGA Speech: ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలి: మోదీ– News18 Telugu

20 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో.. ప్రధానంగా భారత అభివృద్ధిపైనే మాట్లాడారు మోదీ. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ఐక్యరాజ్యసమితిలో వివరించారు.ఉగ్రవాదం మానవత్వానికి పెను ముప్పుగా మారిందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించని ప్రధాని మోదీ.. తన ప్రసంగంలో ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. టెర్రరిజం యావత్ మనవాళికి ప్రమాదకరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం పోరాడేందుకు అందరం కలిసి పనిచేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 125 ఏళ్ల క్రితం చికాగోలో స్వామి వివేకానంద శాంతి, సామరస్యం గురించి ప్రసంగించారని.. భారత్ ఇప్పటికీ అదే సందేశాన్ని ఇస్తోందన్నారు ప్రధాని మోదీ.

ఉగ్రవాదం యావత్ ప్రపంచానికి పెను ముప్పు. ఉగ్రవాదంపై పోరాటేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి శాంతి మిషన్ కోసం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువగా భారత సైనికులు బలిదానం చేశారు. తీవ్రవాదంపై పోరాటం చేస్తున్నాం. ఇది ఒక దేశానికే కాదు. ప్రపంచానికి, మానవత్వానికి కూడా ప్రమాదమే. ఐరాస ఏర్పాటు చేయడానికి మూలం మానవత్వమే. దాన్ని కాపాడుకోవాలి.
— ప్రధాని మోదీ
20 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో.. ప్రధానంగా భారత అభివృద్ధిపైనే మాట్లాడారు మోదీ. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ఐక్యరాజ్యసమితిలో వివరించారు.
నరుడిలో ఈశ్వరుడిని చూడటమే భారతీయ సంస్కృతిగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని స్మరించుకుంటూ  ఐక్యరాజ్యసమితి 74వ జనరల్ అసెంబ్లీలో ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. 2022నాటికి పేదల కోసం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు వివరించారు. దేశాభివృద్ధి అంటే మానవాభివృద్ధిగా పేర్కొన్న ప్రధాని మోదీ...ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 130 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకుని పథకాలను చేపడుతున్నట్లు చెప్పారు. ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధించే దిశగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వివరించారు. దీని కోసం భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజల సంక్షేమం తమ నినాదమన్నారు.గ్లోబల్ వార్మింగ్‌కు భారత్ కారణంకాకున్నా...ఈ  సమస్య పరిష్కారం కోసం భారత్ తీవ్రంగా కృషిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 2025నాటికి టీబీ రహిత దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఉగ్రవాదం యావత్ మానవాళికి ప్రమాదకారిగా ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఐరాస మరింత బలోపేతం కావాల్సి ఉందన్నారు. స్వచ్ఛ భారత్ గురించి తన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రపంచంలో అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఐదు మాసాల్లో దిగ్విజయంగా చేపట్టగలిగినట్లు వివరించారు. ఇందులో భాగంగా దేశంలో 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్లు వివరించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వని అధికారులు.. కేసీఆర్ సభ రద్దు

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో కేసీఆర్ తన సభను రద్దు చేసుకున్నారు. సీఎం రావడం లేదనే ప్రకటనతో సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్న నాయకులు, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.