వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పీపీఏలపై జగన్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలని ఆరోపించారు. టీడీపీ హయంలో జెన్‌కో, ట్రాన్స్‌కోను దేశంలోనే నెంబర్ వన్ చేశామన్నారు. సంస్కరణలతో కరెంట్ కోతలను అధిగమించామన్నారు.డిస్కంలకు అప్పులు లేకుండా చేశామని, కరెంట్ కోతల నుంచి మిగులు విద్యుత్ సాధించామని చంద్రబాబు చెప్పారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనేనని ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన, తక్కువ ధరకు కరెంట్ ఇవ్వాలని ముందుకెళ్లామని, దురుద్దేశంతోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.అధికారులు తప్పుడు సమాచారం ఇస్తారా.. ముఖ్యమంత్రి ఒత్తిడి తెస్తే అధికారులు తప్పుడు సమాచారం ఇస్తారా అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం నాలుగు నెలల్లో ప్రజలకు నరకం చూపించారాని ఫైర్ అయ్యారు. పీపీఏల విషయంలో ఎంత మంది చెప్పినా జగన్ కు అర్దం కాదా అని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వానికి ఇచ్చే నివేదికల్లో ముఖ్యమంత్రికి క్లీన్ చిట్ ఇస్తూ..గత ప్రభుత్వం పైన బుదర చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అధికారులు ఇదే రకంగా సహకరిస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసని..ఇప్పుడు ముఖ్యమంత్రి కోసం చేసినా..తరువాత నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుందని మాజీ సీెం హెచ్చరించారు. తాము భవిష్యత్ ను అంచనా వేసి ఒప్పందాలు చేసుకున్నామని..కానీ ఇప్పుడు దురుద్దేశంతోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనేనని ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన, తక్కువ ధరకు కరెంట్ ఇవ్వాలని ముందుకెళ్లామని చంద్రబాబు వివరించారు.
Comments
Post a Comment