Skip to main content

అయోధ్యపై బాబా రామ్‌దేవ్‌ కీలక వ్యాఖ్యలు

 
అయోధ్యపై బాబా రామ్‌దేవ్‌ కీలక వ్యాఖ్యలు
 అయోధ్య వివాదంపై యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడనే విషయం ముస్లిం సమాజం సహా ప్రపంచం మొత్తానికి తెలుసని వ్యాఖ్యానించారు. ఇక అయోధ్య వివాదం ముగింపునకు వచ్చిందని, ఆ స్థలంలో రామ మందిరం కట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో భాజపాకు మద్దతిస్తున్న ఆయన.. కేంద్ర, రాష్ట్రాల్లో స్థిర ప్రభుత్వం ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు చేసినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను రామ్‌దేవ్‌ అభినందించారు. ‘‘సర్దార్‌పటేల్‌ తర్వాత మోదీ, షా చొరవ తీసుకొని ‘ఒకే దేశం-ఒకే రాజ్యాంగం-ఒకే జెండా’ కలను నెరవేర్చారు. ఈ నిర్ణయం మోదీ-షా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసాన్ని మరింత పెంచాయి. ఇక ఆర్థిక మందగమనం ప్రస్తుతం చాలా దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్షోభాన్ని మోదీ నాయకత్వంలో సమర్థంగా పరిష్కరిస్తారు’’ అని అన్నారు.

Comments