Skip to main content

రోజుకు రూ.33తో చేతికి రూ.4 లక్షలు.. ఇలా పొందండి!



  • ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రెండంకెల రాబడి
  • దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెంట్లు కొనసాగించాలి
  • కాంపౌండింగ్ ప్రయోజనంతో ఎక్కువ లాభం
  • దీంతో చిన్న మొత్తంతో ఎక్కువ రాబడి
చిన్న మొత్తంలో డబ్బుల్ని పెద్ద మొత్తంగా మార్చుకోవడం ఎలా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ఉంటుంది. సంపద సృష్టించేందుకు ఒక ఆప్షన్ అందబాటులో ఉంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ స్కీమ్స్ వంటివి పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగా కొనసాగుతున్నాయి.
అలాగే మ్యూచువల్ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్లకు కూడా ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఇన్వెస్టర్లు దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ల ప్రాధాన్యాన్ని గుర్తించడం ఇందుకు కారణం. దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రయోజనం వల్ల అధిక రాబడిని పొందొచ్చు.

ఎల్‌జే బిజినెస్ స్కూల్ మ్యూచువల్ ఫండ్ నిపుణుడు పూనమ్ రుంగ్టా మాట్లాడుతూ.. ‘మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ.1,000 (రోజుకు దాదాపు రూ.33) ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా మీరు పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.1,20,000 అవుతుంది. దీనిపై మీకు రూ.1,82,946 రాబడి పొందొచ్చు. ఇలా మీరు మరో పదేళ్ల ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తే.. అప్పుడు మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.3.94 లక్షలు లభిస్తాయి. ఇక్కడ వార్షిక రాబడిని 8 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం’ అని వివరించారు
క్రమంగా తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడి పెరుగుతూ వస్తుందని ఆయన తెలిపారు. ‘అలాగే ఇన్వెస్ట్‌మెంట్ మొత్తంపై వచ్చిన రాబడి కూడా మళ్లీ ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తానికి కలుస్తుంది. దీంతో ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం పెరుగుతుంది. దీనిపై మళ్లీ రాబడి లభిస్తుంది’ అని పేర్కొన్నారు.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం కారణంగా పదేళ్లకు పైన దీర్ఘకాలంలో రెండంకెల రాబడిని అందుకోవచ్చని ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజ్‌మెంట్ మేనేజర్ కార్తీక్ ఝవేరి తెలిపారు. మ్యూచువల్ ఫండ్ సిప్ మార్గంలో కనీసం 12 శాతం రాబడి లభిస్తుందని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.