Skip to main content

చిన్నారి బాలయ్య' గోకుల్ కన్నుమూత... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బాలకృష్ణ



తెలుగు బుల్లితెర రంగంలో విషాదం నెలకొంది. జీ తెలుగు చానల్లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో తన డైలాగులు, హావభావాలతో అచ్చు నందమూరి బాలకృష్ణను తలపింప చేసే బాలనటుడు గోకుల్ మృతి చెందాడు. గోకుల్ డెంగ్యూతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశాడు. గతంలో గోకుల్ తన అభిమాన హీరో బాలకృష్ణను కూడా కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. ఇప్పుడు గోకుల్ లేడని తెలియడంతో బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.తమకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదని, అలాంటిది చిన్నారి అభిమాని గోకుల్ మృతి తన మనసును కలచివేస్తోందని తెలిపారు. తానంటే ప్రాణం ఇచ్చే గోకుల్ ఇంత చిన్న వయసులో డెంగ్యూ కారణంగా ఈ లోకాన్ని విడిచివెళ్లడం అత్యంత బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. గోకుల్ డైలాగులు చెప్పే విధానం, హావభావాలు ఎంతో బాగుండేవని, ఎంతో భవిష్యత్తు ఉందని భావించేవాడ్నని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు.

గోకుల్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. తండ్రి యోగేంద్రబాబు, తల్లి సుమాంజలి. మొదటి నుంచి బాలకృష్ణలా డైలాగులు చెబుతూ ఇంటిపక్కనవారిని అలరిస్తూ అంచెలంచెలుగా బుల్లితెర రంగంలో ప్రవేశించి కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. జీ తెలుగు చానల్ లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కు ఎంపికవడంతో గోకుల్ ప్రతిభ అందరికీ తెలిసింది.

Comments